తన నటనతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ కి కేరళలో ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అల్లు అర్జున్ నటించిన సినిమాలు తెలుగు తర్వాత ఎక్కువగా మలయాళంలో అనువాద రూపంలో అదరగొడుతుంటాయి. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకూ బన్నీ సినిమాలు మాలీవుడ్ లో మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా కేరళలో జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్ లో మల్లు ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘పుష్ప 2లో ఒక పాట పూర్తిగా మలయాళంలో ఉంటుంది. ఇది మలయాళ అభిమానులపై నా ప్రేమకు నిదర్శనం. పుష్ప మొదటి భాగంలో నాకు డ్యాన్స్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. కానీ ఈ సారి ఈ మలయాళ పాటలో డాన్స్ మాత్రం అదిరిపోతుంది’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు అక్కడి అభిమానుల్లో భారీ స్థాయి ఆనందాన్ని నింపాయి.
అల్లు అర్జున్ తన మలయాళ అభిమానుల ప్రేమకు పూర్తి క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కు ఇచ్చాడు. ‘నాకు మలయాళంలో ఇంత మంది అభిమానులు దొరికినందుకు కారణం సుకుమార్. ఆయన నా పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దారు. నా సినిమా కోసం మూడేళ్లుగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఇక నుంచి ఇంత ఆలస్యం చేయకుండా ప్రయత్నిస్తాను’ అని తెలిపాడు.
అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి కూడా బన్నీ స్పందించాడు. ‘ఫహద్ ఫాజిల్‌తో కలిసి ఈ వేడుకకు రావాలని అనుకున్నా, కానీ అది కుదరలేదు’ అని చెప్పాడు
ప్రతి సినిమా అందరికీ నచ్చాలని నియమం లేదు. దర్శకులు ఏ కథను అందించాలనుకుంటున్నారో అది ప్రేక్షకులకు చేరాలన్నది వారి ప్రయత్నం.…
నితిన్ - శ్రీలీల కాంబోలో కామెడీ ఫీస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాబిన్ హుడ్". ఈ సినిమా…