ప్రతి సినిమా అందరికీ నచ్చాలని నియమం లేదు. దర్శకులు ఏ కథను అందించాలనుకుంటున్నారో అది ప్రేక్షకులకు చేరాలన్నది వారి ప్రయత్నం. అయితే ప్రేక్షకుల తీర్పు వలన సామాన్య నటుడు కూడా అగ్రస్థాయికి చేరుకుంటాడు. అయితే, సోషల్ మీడియా ప్రభావంతో కొంతమంది ఈ నమ్మకాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రాంక్ వీడియోల పేరిట, ప్రమోషన్ల పేరుతో ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ వీడియో ఒకటి ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది.
‘జబర్దస్త్’ ఫేం రాకింగ్ రాకేష్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్ (KCR)’. నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ‘కేసీఆర్’ అనే టైటిల్‌తో రావటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే సినిమా విడుదల తర్వాత ‘కేసీఆర్’ మూవీ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
అయితే ‘కేసీఆర్’ సినిమాని జనాలకు చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా రాకింగ్ రాకేష్ తాజాగా తన ఇంటిపై ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినట్టు ఓ వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో ‘కేసీఆర్’ మూవీపై పాజిటివ్ గా కంటే నెగటివ్ గా పనిచేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన సినిమా ప్రచారం కోసం ఇలాంటి కాన్సెప్ట్ లు వాడడం మంచి కాదని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
నితిన్ - శ్రీలీల కాంబోలో కామెడీ ఫీస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాబిన్ హుడ్". ఈ సినిమా…
తన నటనతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ కి కేరళలో ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అల్లు…