నితిన్ – శ్రీలీల కాంబోలో కామెడీ ఫీస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా “రాబిన్ హుడ్”. ఈ సినిమా నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్- వన్ మోర్ టైమ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా టీం ఫస్ట్ కనెక్ట్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. “రాబిన్‌హుడ్.. నేను, వెంకీ కలిసి చేస్తున్న సెకండ్ ఫిల్మ్. ‘భీష్మ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. శ్రీలీలతో కూడా ఇది నా సెకండ్ ఫిల్మ్. ఈ సినిమాతో మా పెయిర్ హిట్ పెయిర్ అనిపించుకుంటుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ కి థాంక్యూ. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు రవి గారు లేకపోతే ఈ సినిమా ఇంత రిచ్, ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు. నా కెరియర్ లోనే ఇది హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. ఒక విషయం కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. డిసెంబర్ 25 నాడు రాబిన్‌హుడ్ నిర్మాతలు పెట్టిన డబ్బుని రెంట్టింపుతో సహా మీనుంచి దోచుకొని వారికి ఇస్తాడు. గ్యారెంటీ గా చెబుతున్నా.” అని అన్నారు.
ఈ ఈవెంట్ లో శ్రీలీల ఫై దెబ్బలు పడతాయ్ అంటూ కాస్త ఫన్నీ కామెంట్స్ కూడా చేసారు.
ప్రతి సినిమా అందరికీ నచ్చాలని నియమం లేదు. దర్శకులు ఏ కథను అందించాలనుకుంటున్నారో అది ప్రేక్షకులకు చేరాలన్నది వారి ప్రయత్నం.…
తన నటనతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ కి కేరళలో ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అల్లు…